: క్వార్టర్స్ ప్రత్యర్థి ఎవరైనా 'డోంట్ కేర్' అంటున్న క్లార్క్
వరల్డ్ కప్ గ్రూప్ దశను విజయంతో ముగించిన ఆసీస్ గ్రూప్ లో న్యూజిలాండ్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. స్కాట్లాండ్ తో పోరులో నెగ్గిన అనంతరం ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి ఎవరైనా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశాడు. కంగారూలు మార్చి 20న అడిలైడ్ లో తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ తో గ్రూప్ మ్యాచ్ లో పాకిస్థాన్ నెగ్గితే... ఆస్ట్రేలియాతో క్వార్టర్స్ సమరంలో అమీతుమీకి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో అంతుచిక్కని జట్టుగా పాక్ కు పేరుండడంతో క్లార్క్ పైవిధంగా వ్యాఖ్యానించాడు. ఆసీస్ జట్టు టోర్నీలో మెరుగైన ఆటతీరు కనబరుస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా, వికెట్ల వేటలో దూసుకెళుతున్న లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.