: సల్మాన్ ఖాన్ లో ఈ కళ కూడా ఉంది!
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటుడన్నదే ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ, సల్లూలో మరో కోణం కూడా దాగి ఉంది. సల్మాన్ మంచి చిత్రకారుడట. ఈ కండలరాయుడి శరీరం గట్టిదైనా మనసు మెత్తనంటారు సన్నిహితులు. చిన్న విషయానికి కూడా స్పందిస్తాడని, కష్టాల్లో ఉన్నవారిని ఎన్నడూ విడిచిపెట్టడని ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఈ క్రమంలో తనలో కలిగే స్పందనలను సల్మాన్ వెంటనే కాన్వాస్ పై పెడతాడట. కుంచె అందుకుని చిత్రాలు గీసి పదిలపరుస్తాడని ఫ్రెండ్స్ చెప్పేమాట. ఇప్పుడలా భద్రపరిచిన ఓ పెయింటింగ్ ను సల్మాన్ తన ముద్దులచెల్లి అర్పితకు కానుకగా ఇచ్చాడు. ఆ చిత్రం, నమాజ్ లోని పలు దశలను ప్రతిబింబిస్తుంటోందట. అన్న ఇచ్చిన గిఫ్టును అందుకుని మురిసిపోయిన చెల్లి అర్పిత దాని తాలూకు ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.