: టీమిండియాకు అభినందనలు తెలిపిన కేసీఆర్
ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో సత్తా చాటుతూ, దూసుకుపోతున్న టీమిండియాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్ లలో ఓటమి అన్నదే లేకుండా, జయకేతనం ఎగురవేశారని... ఇదే ఉత్సాహంతో రానున్న మ్యాచ్ లలో కూడా సత్తా చాటాలని అభిలషించారు. ప్రపంచ కప్ ను వరుసగా రెండోసారి కైవసం చేసుకుని సగర్వంతో టీమిండియా స్వదేశానికి తిరిగిరావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఇవాళ జింబాబ్వేతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన స్పందించారు.