: ఈశాన్య రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మేరీకోమ్
ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ భారత దేశ ఈశాన్య రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితురాలైంది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న పదో నార్త్ ఈస్ట్ బిజినెస్ సమ్మిట్ లో దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. మరో రెండు రోజుల్లో అధికారికంగా ఈ విషయాన్ని మేరీకోమ్ కు తెలుపుతామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, వ్యాపార అవకాశాలు, టూరిజం తదితర అంశాలను ఆమె ద్వారా ప్రచారం చేస్తామని జితేంద్రసింగ్ తెలిపారు.