: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరంగం పుంజుకోవాలి: కేఈ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ రోజు కర్నూలులో జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికరంగం పుంజుకోవాలని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి జరిగితేనే ఉపాధికల్పన సాధ్యమవుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తామని తెలిపారు. గత ఏపీఐఐసీలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు.