: రికార్డు ఖాయం... మూసీ నదిపై రాంగోపాల్ వర్మ ట్వీట్లు


వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి హైదరాబాదులోని మూసీనదిపై స్పందించారు. ప్రపంచంలో అత్యంత చెత్త నది మూసీయేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ పార్టీ దీనిపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాలని సూచించారు. మూసీ నది భవిష్యత్తులో తెలంగాణకు పర్యాటక కేంద్రంగా మారాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు. మూసీ నది వీడియో ఫుటేజిని పోటీలకు పంపితే కచ్చితంగా అత్యంత మురికి నగరంగా గిన్నిస్ రికార్డు సాధించడం ఖాయమని సెటైర్ విసిరారు.

  • Loading...

More Telugu News