: మయన్మార్ లో ఘోరం... పడవ మునిగి 50 మంది మృతి


మయన్మార్ లో అత్యంత ఘోరమైన ఘటన సంభవించింది. ఓ పడవ మునిగిన ప్రమాదంలో 50 మంది చనిపోయారు. ఇప్పటివరకు 20 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ట్వంగక్ పట్టణం నుంచి సిత్వే నగరానికి బయలుదేరిన పడవ వాతావరణం అనుకూలించని పరిస్థితిలో మునిగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 209 మంది ప్రయాణికులతో పడవ కిక్కిరిసి ఉంది. సముద్రపు రాకాసి అలలు ముంచెత్తడం వల్లే పడవ మునిగిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News