: ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటే కేంద్ర నిధులు ఎలా వస్తాయి?: టీఆర్ఎస్ కు డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్న
తెలంగాణను ధనిక రాష్ట్రం అని 14వ ఆర్థిక సంఘం అనలేదని... మిగులు నిధులు ఉన్న రాష్ట్రం అని మాత్రమే అన్నదని తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ స్పష్టత ఇచ్చారు. ఆర్థిక సంఘం అన్న మాటను అవకాశంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి తెలంగాణను ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నారని... ధనిక రాష్ట్రాలకు కేంద్రం నిధులను ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో మాట్లాడుతూ, డెబ్బై శాతం మంది పేద ప్రజలు ఉండే రాష్ల్రం ధనిక రాష్ట్రమెలా అవుతుందని నిలదీశారు. ముప్పై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ధనిక రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో మంత్రి ఈటెల కలగజేసుకుని... ముఖ్యమంత్రి తెలంగాణను ధనిక రాష్ట్రం అనలేదని... గత పాలకులు వెనుకబడిన ప్రాంతంగా తయారు చేశారని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.