: 122 పథకాలను 66 చేస్తాం: కేసీఆర్
దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని... ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి అయోగ్ పథకం వచ్చిందని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం ముందుకెళుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 122 పథకాలను 66 పథకాలుగా కుదిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిబంధనలు పెట్టకుండా నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలో రాష్ట్రాలంటే చిన్నచూపు ఉండేదని... ఇప్పుడు అది తొలగిపోయిందని చెప్పారు. రాష్ట్రాలకు రుణపరిమితిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు.