: నేను నెపోలియన్ ను కాదు... రాజకీయ వ్యవస్థను మార్చడమే నా లక్ష్యం: కేజ్రీవాల్
ఢిల్లీలో మంచి పాలనను అందించడం ద్వారా, వ్యవస్థలో మార్పు కోసం కృషి చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రత్యేక చికిత్స కోసం బెంగళూరు వెళ్లిన కేజ్రీ... తొలిసారిగా తన పార్టీకి సందేశం పంపారు. తాను నెపోలియన్ ను కాదని... ప్రస్తుతమున్న రాజకీయ వ్యవస్థను మార్చడమే ఆప్ లక్ష్యమని చెప్పారు. అయితే గత కొంత కాలంగా పార్టీపై, వ్యక్తిగతంగా ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఢిల్లీలో కొత్త తరహా పాలనకు నాంది పలికామని... దీన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాల్సి ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.