: సెంచరీతో అదరగొట్టిన జింబాబ్వే కెప్టెన్... బౌండరీలతో కదం తొక్కిన వైనం
టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ (113 బ్యాటింగ్) వీరవిహారం చేస్తున్నాడు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ జట్టు స్కోరును చక్కదిద్దిన అతడు బౌండరీలతో చెలరేగాడు. వంద బంతుల్లో శతకాన్ని పూర్తి చేసిన టేలర్, భాతర బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. టోర్నీలో పొదుపుగా బౌలింగ్ చేసిన అశ్విన్, టేలర్ ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓ వైపు హాఫ్ సెంచరీ పూర్తి కాగనే విలియమ్స్ పెవిలియన్ చేరినా, ఏమాత్రం వెనక్కు తగ్గని టేలర్, తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. టేలర్ వీరవిహారంతో జింబాబ్వే 40 ఓవర్లలో 207 పరుగుుల చేసింది.