: ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే... నిప్పులు కక్కుతున్న ‘టీమిండియా’ బంతులు
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల చేతుల నుంచి పదునైన బంతులు దూసుకొస్తున్నాయి. దీంతో జింబాబ్వే బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోతున్నారు. కొద్దిసేపటి క్రితం న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ లో ప్రారంభమైన మ్యాచ్ లో ఆదిలోనే జింబాబ్వే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడ్డ జింబాబ్వే స్టార్ ప్లేయర్ హామిల్టన్ మసకద్జా (2) కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. దీంతో మూడున్నర ఓవర్లలోనే 11 పరుగులు చేసిన జింబాబ్వే తొలి వికెట్ ను చేజార్చుకుంది. ఆ తర్వాత మరో ఆరు బంతులు ఆడిన జింబాబ్వే మరో వికెట్ ను కూడా కోల్పోయింది. మొహ్మద్ షమీ వేసిన బంతిని ఆడబోయిన ఓపెనర్ చామూ చిబాబా(7) శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది.