: స్పృహ తెప్పించేందుకు చెంపపై కొట్టి సస్పెండయ్యాడు!


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీలో ఓ వైద్యుడు స్పృహలోలేని పేషెంటును చెంపపై కొట్టి సస్పెన్షన్ కు గురయ్యాడు. చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ స్పృహలోకి రాకపోవడంతో, స్పృహ తెప్పించేందుకు ఆ వైద్యుడు పలుమార్లు చెంపపై కొట్టాడు. అలా కొడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి చిత్రీకరించడం, ఆ వీడియోను నెట్ కు అప్ లోడ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ వీడియా కాస్తా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవికాంత్ దృష్టికి వెళ్లింది. దీంతో, ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అంతేగాదు, సదరు చెంపదెబ్బల డాక్టర్ ను సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News