: ముంబైలో టోల్ గేట్ సమస్యలపై సచిన్ లేఖ
ముంబైలో టోల్ గేట్ సమస్యలపై మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ స్పందించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు. "ప్రస్తుతం ముంబయి నగరం చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టోల్ గేట్ కార్యాకలాపాలపై నేను తీవ్ర ఆందోళనకు గురయ్యా. కావున ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను సరళతరం చేసి నగర ప్రజలను టోల్ గేడ్ సమస్యల నుంచి బయటపడవేయాలని కోరుతున్నా" అని సీఎంకు తన పేరుపై ఉన్న లెటర్ హెడ్ తో రాసిన రెండు పేజీల లేఖలో పేర్కొన్నాడు. ఫిబ్రవరి 20న ఆ లేఖ సచిన్ రాయగా తాజాగా మంత్రి ఆ రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ మీడియాకు వెల్లడించారు.