: ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని విడుదల చేయండి... ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
26/11 ముంబై ఉగ్రదాడుల వెనకున్న మాస్టర్ మైండ్, కరడుగట్టిన ఉగ్రవాది జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లఖ్వీ అరెస్ట్, నిర్బంధం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2008లో ముంబైలో ఉగ్రవాదుల ఊచకోతలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం, 2009 నుంచి లఖ్వీ పాక్ లోని రావల్పిండి జైలులో ఉన్నాడు. తాజాగా, ముంబై దాడుల ఘటన వెనుక... లఖ్వీ హస్తం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై భారత్ ఎలా స్పందించనుందో వేచి చూడాలి.