: కేసీఆర్ మాటంటే మాటే... కొత్త సచివాలయానికి నిధులు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటే... వెనకడుగు వేయరని రాజకీయ నేతలు అటుంటారు. ప్రస్తుతమున్న సచివాలయం సరిపోవడం లేదని... అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా కొత్త సచివాలయాన్ని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్మిస్తామని... ప్రస్తుతమున్న ఆసుపత్రిని నగర శివార్లలోకి మారుస్తామని ఇటీవలే కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిని ఎలా తరలిస్తారో చూస్తామని విపక్ష నేతలు గర్జించారు. అయినా, ఈ విమర్శలు, హెచ్చరికలను కేసీఆర్ చాలా లైట్ గా తీసుకున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయని ముఖ్యమంత్రి సచివాలయాన్ని మార్చడానికి తాజా బడ్జెట్లో రూ. 150 కోట్లు కేటాయించారు. దీంతో, సచివాలయం మార్పు ఖాయమనే విషయం విదితమవుతోంది.