: హైదరాబాద్ హైకోర్టు వద్ద ఉద్రిక్తత!


హైకోర్టును తక్షణం విభజించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లాయర్లు 'చలో హైకోర్టు'కు పిలుపు ఇవ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు వున్నవారినే లోపలి అనుమతిస్తున్నారు. న్యాయవాదులందరూ ఒకే చోట చేరితే ఇరు వర్గాల మధ్య గొడవ జరిగే అవకాశాలున్నాయని భావిస్తూ, హైకోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇరువైపులా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత లాయర్లు మోహరించినట్టు తెలుస్తోంది. ఎక్కడ గుంపుగా లాయర్లు కనిపించినా వారిని చెదరగొడుతున్నారు.

  • Loading...

More Telugu News