: హీరో, హీరోయిన్ల మెయింటెనెన్స్ ఖర్చు లెక్కలోకి రాదు: కృష్ణంరాజు
హీరో, హీరోయిన్లకిచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఖర్చు అని అంతా భావిస్తారని సీనియర్ హీరో, బీజేపీ నేత కృష్ణంరాజు తెలిపారు. సినీ పరిశ్రమపై ఐటీ శాఖ విధించే పన్నులపై ఆయన మాట్లాడుతూ, సినిమా నిర్మాణం అంటే రెమ్యూనరేషన్లు మాత్రమే కాదని అన్నారు. హీరో, హీరోయిన్ల ఫిజికల్ ఫిట్ నెస్, కాస్ట్యూమ్స్, భోజన సౌకర్యాలు, ప్రయాణ సౌకర్యాలు... ఇలా ఎన్నో ఖర్చులుంటాయని, అయితే, అలాంటివన్నీ లెక్కలోకి రావని, అవి కోట్లలో ఉంటాయని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమలో నిర్మాతలు కష్టనష్టాలకోర్చి సినిమాలను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు.