: పంచెకట్టులో బిగ్ బీ అమితాబ్... నాగార్జున, విక్రంలతో కలిసి యాడ్ షూటింగ్!


కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంలో రోజుకో కొత్త సూట్ తో దర్శనమిచ్చే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఉన్నట్టుండి పంచెకట్టులో కనిపిస్తే ఎలా ఉంటుంది?. మిగతా వారికి ఎలా ఉంటుందో తెలియదు కాని, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు మాత్రం కన్నుల పండుగే. దక్షిణాది సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో అమితాబ్ బచ్చన్ టీవీ తెరపై తళుక్కున మెరవనున్నారు. ఇటీవల చెన్నై వచ్చిన ఆయన టాలీవుడ్, కోలీవుడ్ సూపర్ స్టార్లు నాగార్జున, విక్రం తదితరులతో కలిసి ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. అది కూడా నిండా పంచెకట్టులో. ఈ ఫొటోలను ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. త్వరలోనే పంచెకట్టులోని అమితాబ్ మన టీవీ తెరలపై ప్రత్యక్షం కానున్నారు.

  • Loading...

More Telugu News