: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-2
2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు... * మైనారిటీ సంక్షేమానికి రూ. 379 కోట్లు * స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 1,080 కోట్లు * వికలాంగులకు రూ. 45 కోట్లు * చేనేత రంగానికి రూ. 46 కోట్లు * గృహ నిర్మాణ రంగానికి రూ. 897 కోట్లు * వైద్య, ఆరోగ్య రంగానికి రూ. 5,728 కోట్లు * విద్యా రంగానికి రూ. 14,962 కోట్లు * గ్రామీణాభివృద్ధికి రూ. 8,212 కోట్లు * ఇంటర్ ఉన్నత విద్యకు రూ. 3,049 కోట్లు * గ్రామీణ నీటి సరఫరాకు రూ. 881 కోట్లు * విద్యుత్ శాఖకు రూ. 4,062 కోట్లు * మౌలిక సదుపాయాలకు రూ. 195 కోట్లు * పర్యాటక రంగానికి రూ. 339 కోట్లు * నైపుణ్యాల అభివృద్ధికి రూ. 360 కోట్లు * గనులు, భూగర్భ శాఖకు రూ. 27 కోట్లు * కార్మిక శాఖకు రూ. 281 కోట్లు * పంచాయతీ రాజ్ శాఖకు రూ. 3,296 కోట్లు * ఐటీ శాఖ అభివృద్ధికి రూ. 370 కోట్లు * పరిశ్రమల అభివృద్ధికి రూ. 637 కోట్లు * రోడ్లు, భవనాల కోసం రూ. 2,690 కోట్లు * ఇంధన శాఖకు రూ. 4,360 కోట్లు * హోం శాఖకు రూ. 4,062 కోట్లు * దేవాదాయ శాఖకు రూ. 200 కోట్లు