: ఆలం బెయిల్ పై సవాల్ చేయండి... జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
వేర్పాటువాద నేత మసరత్ ఆలం విడుదలపై రాజకీయ దుమారం చెలరేగడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అతని బెయిల్ పై కోర్టులో సవాల్ చేయాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. అంతేగాక ఆలంపై, అతని సహచరులపై నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ సలహా ఇచ్చింది. "ఆలంపై ఉన్న 27 కేసులపై కఠినంగా వ్యవహరించాలి. ఆ కేసుల్లో అతనికిచ్చిన బెయిల్ పైన సవాల్ చేయాలి" అని ఆదేశించినట్టు పార్లమెంటులో ఈరోజు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.