: లాకప్ డెత్ ఘటనలో పోలీసులపై వేటు... సీఐ, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్


తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో నేటి ఉదయం వెలుగుచూసిన లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ జోగిపేట సీఐ నాగయ్య, పుల్కల్ ఎస్సై లోకేశ్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. హత్యకేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మణ్ అనే వ్యక్తి రాత్రి పోలీసుల కస్టడీలో మరణించాడు. పోలీసులు పెట్టిన చిత్రహింసల కారణంగానే అతడు చనిపోయాడని ఆరోపిస్తూ బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాక బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు సమాచారం. దీంతో సీఐ, ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News