: 400 దాటలేదు... యూఏఈ లక్ష్యం 342 పరుగులు


వెల్లింగ్టన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోరులో యూఏఈపై దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. అంతకుముందు రెండు మ్యాచ్ లలో 400 పైచిలుకు పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా జట్టు బలహీనమైన యూఏఈపై ఆ ఫీట్ ను సాధించడంలో విఫలం అయింది. ఒక్క పరుగు తేడాలో ఏబీ డివిలియర్స్ సెంచరీ కోల్పోయాడు. మొత్తం 82 బంతులను ఎదుర్కొన్న డివిలియర్స్ 6 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 99 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ బెహర్దీన్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడి 31 బంతుల్లో 64 పరుగులు చేయగా, మిల్లర్ 49, రొసౌ 43 పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో మహ్మద్ నవీద్ 3 వికెట్లు తీయగా, షాజాద్, జావెద్, తాఖిర్ లు తలా ఒక వికెట్ సాధించారు. మరికాసేపట్లో 342 పరుగుల విజయ లక్ష్యంతో యూఏఈ బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News