: నిర్విరామంగా పనిచేశా... ఇక విశ్రాంతి తీసుకుంటా: గూగుల్ సీఎఫ్ఓ
"సుమారు 30 ఏళ్ల పాటు నిర్విరామంగా పని చేశా, ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను" అని గూగుల్ సీఎఫ్ఓ పాట్రిక్ పిషెట్టి తెలిపారు. 52 ఏళ్ల పాట్రిక్ గూగుల్ ప్లస్ పేజ్ లో తన రిటైర్మెంట్ పై సుదీర్ఘ లేఖ రాశారు. ఫ్రెంచ్-కెనడియన్ అయిన పాట్రిక్ రిటైర్మెంట్ తరువాత పర్యాటకుడిగా వివిధ దేశాలు సందర్శించాలని భావిస్తున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్ తరువాత కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో టెలికాం పరిశ్రమలో పని చేసిన పాట్రిక్ 2008లో గూగుల్ సంస్థలో చేరారు.