: ఏపీ ఎక్స్ ప్రెస్ ను విశాఖ నుంచి నడపాలి: మురళీమోహన్
నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్ లోక్ సభలో తన బాణీని సమర్థంగా వినిపిస్తున్నారు. హైదరాబాదు నుంచి దేశ రాజధానికి నడుస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ ను ఇకపై విశాఖ నుంచి నడపాలని కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఎప్పటినుంచో నలుగుతున్న రైల్వే యూనివర్శిటీ వ్యవహారాన్ని కూడా మురళీమోహన్ ప్రస్తావించారు. ఏపీలో రైల్వే యూనిర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో రాజమండ్రి రైల్వేస్టేషన్ లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఇక, సభ ముగిసిన తర్వాత ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి పలు అంశాలపై చర్చించారు.