: మణిపూర్ కు పాకిన స్వైన్ ఫ్లూ
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలను వణికించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి... దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఇవాళ తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదయింది. 35 ఏళ్ల మహిళ ఇంఫాల్ లో హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని ఆ రాష్ట్రానికి చెందిన వైద్య అధికారి వెల్లడించారు. మరో ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాలు కనిపించాయట. వారి రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ముంబయికి పంపారు.