: షారుక్ ఖాన్ కు బాంబే మున్సిపల్ కార్పోరేషన్ జరిమానా


నటుడు షారుక్ ఖాన్ కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) రూ.1.93 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు ఈ నెల 5న ఖాన్ కు నోటీసు పంపారు. ఈ నెల 12వ తేదీలోగా చెల్లించాలని గడువు విధించారు. చెల్లించకుంటే తక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఎంసీ హెచ్చరించింది. ముంబయిలోని షారుక్ నివాసం మన్నత్ కు బయట రహదారిపై తన వ్యానిటీ వ్యాన్ పార్కింగ్ చేసుకునేందుకుగానూ షారుక్ ర్యాంపు నిర్మించుకున్నాడు. దాన్ని అక్రమంగా నిర్మించినట్టు బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ బీఎంసీకి లేఖ రాయడంతో ఫిబ్రవరి 14న పోలీసుల సమక్షంలో బీఎంసీ అధికారులు ఆ ర్యాంపును పగలకొట్టించారు. దానికి అయిన ఖర్చును స్వయంగా అతనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News