: వెంబడించి పట్టుకుని, మూడు గంటలపాటు చితకబాదారు: బెంగళూరులో ఆఫ్రికన్ల ఆవేదన
బెంగళూరులో నలుగురు ఆఫ్రికన్లపై దాడి జరిగింది. సోమవారం అర్ధరాత్రి తరువాత ఇంటికి వస్తుండగా కొందరు వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని జాన్ అనే ఆఫ్రికా జాతీయుడు తెలిపారు. బైరాతీ ప్రాంతంలో తనతో పాటు తన ముగ్గురు మిత్రులను వెంబడించి పట్టుకుని, మూడు గంటలపాటు దారుణంగా చితకబాదారని మీడియాకు వివరించాడు. వారు ఎందుకు దాడి చేశారో తెలియడం లేదని ఆఫ్రికన్లు వాపోయారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, అక్కడ జరిగింది దాడి కాదని, కేవలం తోపులాట అని చెప్పారు. దాడి గురించి ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ, వార్తల్లో ప్రసారం కావడంతో సుమోటోగా కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జాన్ కు గాయాలు దాడి వల్ల జరిగాయా? ఇంకేవైనా కారణాలున్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.