: పవన్ కల్యాణ్ కు అభిమానిని... ఆయననెందుకు కామెంట్ చేస్తాను?: ట్విట్టర్లో హన్సిక
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటనకు తాను పెద్ద అభిమానినని సినీ నటి హన్సిక తెలిపింది. పవన్ కల్యాణ్ పై హన్సిక కామెంట్ చేసిందంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి. దీంతో, ఆమెపై పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. దీనిపై హన్సిక ట్విట్టర్లో స్పందించింది. పవన్ కల్యాణ్ ను కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో కథనాలు వెలువడడంతో తాను స్పందిస్తున్నానని పేర్కొంది. అవన్నీ పుకార్లని, తాను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. పవన్ పై వ్యాఖ్యలు చేశాననడం అవాస్తమని పేర్కొంది. ఇలాంటి వదంతులను ఆపేయాలని హన్సిక ట్విట్టర్లో కోరింది.