: మీరు ముళ్లకంపపై కూర్చున్నారు... కోడెలపై చంద్రబాబు జోక్


గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ వేదికగా జోకులు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ ప్రసంగంలో అవకాశం చిక్కినప్పుడల్లా విపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పనిలోపనిగా స్పీకర్ కోడెలపైనా ఓ జోకేశారు. సభలో మానసిక రోగులు ఉన్నారని వైకాపా సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక్కడ తాను మహామహులతో పాటుగా 30 సంవత్సరాలకు పైగా కూర్చున్నానని, ఇప్పుడు కూర్చోవాలంటే విసుగు పుడుతోందని అంటూ, "నాకు తెలుసు అధ్యక్షా... మీరు కూడా ముళ్లకంపపై కూర్చున్నారు" అన్నారు. రెండు మూడుసార్లు 'మానసిక రోగులు' అన్న పదాన్ని ఆయన వాడడంతో సభలో గందరగోళం చెలరేగింది.

  • Loading...

More Telugu News