: బోర్లా పడ్డ లంక 'తోక'... స్కాట్లాండ్ విజయ లక్ష్యం 364
ఓపెనర్ దిల్షాన్, రికార్డు సెంచరీ వీరుడు సంగక్కర, అర్ధ సెంచరీ చేసిన మాథ్యూస్ మినహా మరెవరూ రాణించలేక పోవడంతో లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. లంక జట్టులో తిరిమన్నే 4, దిల్షాన్ 104, సంగక్కర 124, జయవర్ధనే 2, మాథ్యూస్ 51, కేజే పెరీరా 24, పెరీరా 7, ప్రసన్న 3, కులశేఖర 2, మలింగా 1 పరుగులు చేశారు. చివర్లో కులశేఖర 18, చమీర 12 పరుగులు చేసి జట్టు ఆలౌట్ కాకుండా ఆదుకున్నారు. స్కాట్లాండ్ జట్టులో డేవీ 3, ఎవాన్స్, బెర్రింగ్టాన్ చెరో 2, టేలర్, మకాన్ లకు చెరో వికెట్ లభించాయి. మరికాసేపట్లో 364 పరుగుల విజయ లక్ష్యంతో స్కాట్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది.