: దిగ్గజాలు బ్రాడ్ మెన్, రిచర్డ్స్, సచిన్, లారాల వల్ల కాలేదు... చేసి చూపించిన సంగక్కర
వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలో దిగ్గజాలుగా, ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించిన ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న బ్రాడ్ మెన్, రిచర్డ్స్, సచిన్, లారా తదితరులు ఎవరూ చేయని అద్భుతాన్ని శ్రీలంక క్రికెటర్ సంగక్కర చేసి చూపించాడు. ఎవరూ సాధించని రికార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగు వరుస మ్యాచ్ లలో సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సంగక్కర ఈ ఫీట్ ను చేరుకోగానే ప్రముఖ క్రికెటర్లు తమ తమ ట్వీట్ల ద్వారా అభినందనలతో ముంచెత్తారు. ఈ వరల్డ్ కప్ పోటీలలో నేటి మ్యాచ్ లో స్కాట్లాండ్ సహా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లపై సంగక్కర సెంచరీలు సాధించి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.