: ప్రపంచ పర్యటనలో భాగంగా ఇండియాలో ల్యాండ్ అయిన సౌర శక్తి విమానం


పూర్తి సౌరశక్తితో నడుస్తూ ప్రపంచాన్ని చుట్టి రావాలని ఒమన్ రాజధాని మస్కట్ నుంచి బయలుదేరిన విమానం 'సోలార్ ఇంపల్స్ 2' ఇండియాలో ల్యాండ్ అయింది. విజయవంతంగా అరేబియా సముద్రాన్ని దాటి నిన్న రాత్రి 11:25 గంటల సమయంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో దిగింది. ఈ విమానం మస్కట్ నుంచి అహ్మదాబాద్ వరకు మొత్తం 1,465 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి దాదాపు 16 గంటలు పట్టింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు విమానానికి స్వాగతం పలికారు. ఈ విమానం 4 రోజులపాటు అహ్మదాబాద్ లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, వినియోగంపై పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 16న 'సోలార్ ఇంపల్స్ 2' వారణాసికి వెళ్లి అక్కడి నుంచి మయన్మార్ కు బయలుదేరనుంది. తన ప్రయాణంలో భాగంగా చైనాలోని నాన్జింగ్ విమానాశ్రయం నుంచి హవాయి ఎయిర్ పోర్టుకు 8,500 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజుల పాటు నిరంతరాయంగా ప్రయాణించనుంది.

  • Loading...

More Telugu News