: 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉంది: నాగార్జున ట్వీట్


15 ఏళ్ల క్రితం రమ్యకృష్ణ ఎంత అందంగా ఉందో ఇప్పటికీ అంతే అందంగా ఉందని ప్రముఖ హీరో నాగార్జున ట్వీట్ చేశాడు. 'సంకీర్తన', 'ఇద్దరూ ఇద్దరే', 'క్రిమినల్', 'ఘరానా బుల్లోడు', 'హలో బ్రదర్', 'అన్నమయ్య' వంటి సినిమాల్లో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ జంట తాజాగా 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో నటిస్తోంది. మైసూర్ లోని 1500 ఏళ్లనాటి విష్ణు దేవాలయంలో జరుగుతున్న షూటింగులో పాల్గొన్న సందర్భంగా రమ్యకృష్ణతో కలిసి సన్నివేశం పూర్తి చేసిన నాగార్జున, ఆమెతో కలిసి చేసిన సన్నివేశం ఫోటోలను ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రమ్య అందం ఏమాత్రం చెక్కు చెదరలేదని అన్నారు.

  • Loading...

More Telugu News