: తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి చాడ వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో సీపీఐ తొలి మహాసభలు ముగిశాయి. ఖమ్మంలో జరిగిన ఈ సభల్లో నారాయణ, సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగింపు రోజున పువ్వాడ నాగేశ్వరరావు, సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేనిలను పార్టీ నేతలు సన్మానించారు. ఇదే సమయంలో 31 మందితో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటైంది. కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి రెండవసారి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా సిద్ధి వెంకటేశ్వర్లు, పల్లా వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.