: సంజయ్ దత్ సెలవుతో మాకెలాంటి సంబంధం లేదు: కేంద్రం
జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్... తరచూ సెలవులు తీసుకుంటూ, ఇంటివద్ద గడిపి వస్తుండటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం వివాదాస్పదం అవుతోంది. సంజయ్ దత్ కు తరచూ సెలవులు ఇస్తుండటం వెనుక... కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందా? అంటూ ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు.... ఆ విషయంతో కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధింత కోర్టుల ఇష్టానుసారమే సెలవులు మంజూరవుతున్నాయని చెప్పారు.