: భారత్ మార్కెట్ లోకి యూఎస్ స్మార్ట్ ఫోన్


ఎప్పటికప్పుడు కొత్తరకం మొబైల్స్ వినియోగంలో భారతీయులు ముందంజలో ఉన్నారు. తాజాగా, భారత మార్కెట్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన 'ఇన్ ఫోకస్' (InFocus) మొబైల్ ఎం2 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. దాని ధర రూ.4,999 మాత్రమే. అమెరికాలో తయారైన ఈ స్మార్ట్ ఫోన్ 4.2 అంగుళాల డబ్ల్యుఎక్స్ జీఏ డిస్ ప్లే, 1280x768 రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ ఫోన్ లో 1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, రియర్ కెమెరా ఉన్నాయి. దాంతోపాటు అంతర్గత మెమొరీ 8 జీబీ, 1 జీబీ రామ్ ఉన్నాయి. ఈ 'ఫాక్స్ కాన్' తయారీ ఫోన్ ప్రస్తుతానికి నలుపు, తెలుపు రంగుల్లో స్నాప్ డీల్ వెబ్ సైట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

  • Loading...

More Telugu News