: భయపడేది లేదు, ఎవరితోనైనా కొట్లాడతా... అదృష్టంతోనే అధికారంలోకి బాబు: జగన్
"వైఎస్ చనిపోయే వరకూ, కాంగ్రెస్ లో ఉన్నంత వరకూ జగన్ మంచివాడిగా ఉండి ఆ తరువాత చెడ్డవాడై పోయాడా?" అని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ అసెంబ్లీలో ప్రశ్నించారు. తాను ఆ రోజు ఇచ్చిన ఒక్కమాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చానని, ఆనాడు సోనియా గాంధీతో కొట్లాడానని, అన్యాయం జరిగితే ఎవరితోనైనా కొట్లాడతానని అన్నారు. కేవలం అదృష్టం కారణంగానే చంద్రబాబు పదవిలోకి వచ్చాడని విమర్శించారు. దేనికీ భయపడనని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ తక్షణం బీజేపీకి మద్దతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.