: మీరే సభ్యులను రెచ్చగొడుతున్నారు: జగన్ పై స్పీకర్ ఆగ్రహం
నిన్న తోసిపుచ్చిన వాయిదా తీర్మానాలపై తిరిగి చర్చకు పట్టుబట్టిన వైకాపాపై స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైకాపా సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తుండటంతో ఆయన అసహనాన్ని ప్రదర్శించారు. వద్దనుకున్న అంశాలపై చర్చకు ఎలా అనుమతిస్తామని ఆయన అన్నారు. "మీరే కావాలని మీ ఎంఎల్ఏలను రెచ్చగొడుతున్నారు. ఇది సరి కాదు. నిబంధనల ప్రకారమే నడచుకోవాలి. మీ ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకునేది లేదు" అంటూ సభను మరో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.