: హోం మంత్రి బంధువునంటూ గుండాయిజం... తన బంధువు కాదన్న హోం మంత్రి


ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప బంధువునంటూ రాజమండ్రిలో అవినాష్ అనే వ్యక్తి పలు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రతినిధినంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అనంతరం అతని నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వమన్న వ్యక్తులను భయబ్రాంతులను చేసేందుకు, తాను గతంలో బెదిరింపులకు పాల్పడిన వీడియోలను పంపి భీతావహులను చేసేవాడు. ఇతనిపై ఫిర్యాదుతో ఫిబ్రవరి 27న అదుపులోకి తీసుకున్న పెద్దాపురం పోలీసులు, అందుకు సాక్ష్యాలు లేకపోవడంతో అతనిని వదిలిపెట్టారు. తాజాగా అతను పలువురిపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు ప్రసారం చేయడంతో అతనిని అదుపులోకి తీసుకునే అవకాశముంది. దీనిపై స్పందించిన హోం మంత్రి చినరాజప్ప తనకు, అవినాష్ అనే వ్యక్తికి సంబంధం లేదని, అతను తన బంధువు కాదని స్పష్టం చేశారు. అతనిపై పోలీసులు తగిన చర్యతీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News