: ఆమెది జాతి వివక్ష హత్య కాదు...వీడియో విడుదల చేసిన ఆసీస్ పోలీసులు


ఆస్ట్రేలియాలోని సిడ్నీలో శనివారం చోటుచేసుకున్న హత్య జాతి వివక్షతో చేసినదని చెప్పేందుకు ఎలాంటి ఆధారం దొరకలేదని ఆ దేశ పోలీసులు తెలిపారు. భారతీయ ఐటీ కన్సల్టెంట్ ప్రభా అరుణ్ కుమార్ హత్యపై ప్రత్యేక డిటెక్టివ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు భారత కౌన్సిల్ జనరల్ తెలిపారు. కేసును ఛేదించేందుకు అన్ని మార్గాల్లో దర్యాప్తు చేస్తున్న ఆసీస్ పోలీసులు ఆమె ఇంటి ముందు నడుస్తూ వెళ్తున్న సీసీ టీవీ పుటేజ్ ను విడుదల చేశారు. సీసీ పుటేజ్ లో ప్రభా అరుణ్ కుమార్ బెంగళూరులో ఉన్న తన భర్తతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనంతరం కొందరు దుండగులు ఆమెను హత్య చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News