: ఇలా అయితే కష్టమే: చంద్రబాబు
ఆర్థిక ఇబ్బందులు ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి మినహాయింపులు, నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర స్థితి గతులు వివరించామని ఆయన చెప్పారు. ఐదేళ్ల తరువాత మిగిలిన రాష్ట్రాలు మిగులు బడ్జెట్ లో ఉంటే, ఏపీ లోటు బడ్జెట్ లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 7 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చారని ఆయన చెప్పారు. రాజధానికి 5 లక్షల కోట్లు కావాలని చెప్పానని, హుదూద్ పరిహారం కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. పోలవరం పూర్తి కావాలంటే మరో నాలుగేళ్లు పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏటా వంద కోట్లు కేటాయిస్తే వందేళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.