: ప్రధాని మోదీని తొలిసారి కలిసిన మమతా బెనర్జీ


భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ మధ్యాహ్నం ఆయనను తొలిసారిగా కలిశారు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరినట్టు సమాచారం. అయితే దీనికి మోదీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో బొగ్గు గనుల వేలం, క్లీన్ గంగా ప్రచారంలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ యిచ్చినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్ అప్పుల్లో ఉన్న విషయం వాస్తవమని ప్రధాని అంగీకరించారని, అదనపు నిధులు అందించే విషయాన్ని పరిశీలిస్తానని మోదీ వెల్లడించినట్టు సమావేశం అనంతరం ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News