: సీనియర్ జర్నలిస్ట్, 'అవుట్ లుక్' వ్యవస్థాపక ఎడిటర్ వినోద్ మెహతా కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్, 'అవుట్ లుక్' వ్యవస్థాపక సంపాదకుడు వినోద్ మెహతా ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ది సండే అబ్జర్వర్, ది ఇండిపెండెంట్, ది పయనీర్ వంటి పలు పత్రికలను విజయవంతంగా నడిపించారు. నటి మీనా కుమారి, రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీ జీవిత చరిత్రలను రాశారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలిపారు. మెహతా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేవారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.