: సివిల్ జడ్జి పరీక్షను అడ్డుకుంటున్న తెలంగాణ లాయర్లు... అరెస్ట్
జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ ఇప్పుడే వద్దని డిమాండ్ చేస్తూ, తెలంగాణ న్యాయవాదులు పరీక్షలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాదు, మీర్ పేటలో జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షను న్యాయవాదులు అడ్డుకోగా, పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. న్యాయవాదులు రావచ్చనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం జారీచేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తాను తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయాలన్నది వీరి ప్రధాన డిమాండ్.