: విజయానికి దగ్గరవుతున్న న్యూజిలాండ్, ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా
వరల్డ్ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏకపక్షంగా సాగుతోంది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు విజయానికి దగ్గరైంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు. మరోవైపు, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయి ఆచితూచి ఆడుతున్నారు. 5వ ఓవర్ రెండో బంతికి వార్నర్, 9వ ఓవర్ నాలుగో బంతికి ఫించ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు.