: 56 అంగుళాల ఛాతీ ఎందుకు?: మోదీపై కాంగ్రెస్ పరోక్ష విమర్శలు
తమ జలాల్లోకి భారత జాలర్లు వస్తే కాల్చి చంపడానికి వెనుకాడబోమని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. 56 అంగుళాల ఛాతీ భారతీయ ఓటర్లకు చూపించడానికి మాత్రమే ఉందని, విదేశీ బెదిరింపులకు కాదని ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పరోక్ష విమర్శలు చేశారు. జాలర్ల అంశంపై శ్రీలంక ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తత రేపడం తగదని, ఈ పరిణామం భారత్ కు మంచిది కాదని అన్నారు.