: చిన్నారి మమత కిడ్నాప్ మహిళల పుటేజీ విడుదల
హైదరాబాదులోని నల్లకుంటలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ ఉదంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, నల్లకుంటలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులను గుర్తు తెలియని ఇద్దరు మహిళలు ఐస్ క్రీం కొనిస్తామంటూ తీసుకెళ్లారు. ఆటోలో ముగ్గురినీ తీసుకువెళ్లిన ఇద్దరు మహిళలు తార్నాకలో ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్లారు. ఎల్ కేజీ చదవుతున్న మమతను మాత్రం తమతో తీసుకుపోయారు. వారి విజువల్స్ నల్లకుంట, తార్నాకలోని షాపుల్లోని సీసీ పుటేజ్ లో దొరికాయి. పోలీసులు వీటిని మీడియాకు విడుదల చేశారు. కిడ్నాపర్ల ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని పోలీసులు నగర వాసులను కోరారు. కిడ్నాప్ కేసును ఛేదిస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోపక్క బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.