: తెలంగాణపై ఆజాద్ తో చర్చించిన బొత్స
కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన బొత్స అరగంట పాటు ఆజాద్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు తెలంగాణ అంశంపై ఆజాద్ తో చర్చించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఢిల్లీలోని మరికొందరు పార్టీ సీనియర్ నేతలతో బొత్స భేటీ కానున్నట్లు తెలుస్తోంది.