: సిలబస్‌లో లేని ప్రశ్నలు చూసి ఒత్తిడితో కుప్పకూలిన విద్యార్థులు
ప్రీపబ్లిక్ పరీక్షలు రాయాలని వచ్చిన విద్యార్థులు సిలబస్‌లో లేని ప్రశ్నలు చూసి ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి హైస్కూల్ లో జరిగింది. ఈ ఉదయం పదో తరగతి విద్యార్థులకు ప్రీపబ్లిక్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురు విద్యార్థులు పరీక్షహాలులో నీరసించి పడిపోయారు. ఆ వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే సిలబస్ లో లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారని, దాంతో అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.